సర్వత్రా విమర్శలతో దిగివచ్చిన అమెజాన్..

గత రెండు రోజులుగా అమెజాన్ అనే ఆన్ లైన్ ఇ కామర్స్ సంస్థపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం హిందూ, ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళ చిత్రాలను ముద్రించిన డోర్ మ్యాట్స్ ని అమ్మడం. దైవాన్ని కించపరిచే ఇటువంటి సంస్థలను భారత్ లో నిలిపివేయాలని డిమాండ్ దేశమంతటా కోరింది. అయితే ఈ అంశంపై స్పందించిన అమెజాన్ సంస్థ మనోభావాలను బాధిన్చినట్లైతే క్షమించాలని తక్షణమే సంబంధిత వస్తువులను అమ్మడం నిలిపివేస్తున్నామని అమెజాన్ సంస్థ తెలిపింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రెండు రోజులుగా విస్తృత చర్చలే జరిగాయి. #BoycottAmazon అనే పదాన్ని వాడుతూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఆ వస్తువులను అమెజాన్ తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. కాకపోతే ఈ ప్రభావం అమెజాన్ వినియోగదారులపై , కొనుగోళ్ళపై పడే అవకాశం భారీగానే ఉంది.

Leave a Reply