వ్యాపారాలు తప్ప ప్రజా క్షేమం పట్టదా?

గత కొన్ని రోజులుగా టివిల్లో వస్తున్న కమర్షియల్ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించే మాదిరిగా ఉన్నాయి. ఈ మధ్య టివిలో వస్తున్న ఒక  మొబైల్ అప్లికేషన్ వ్యాపార ప్రకటనను గమనిస్తున్నారా? ఆ ప్రకటనలో ఒక వ్యక్తి పెట్రోల్ బంకులో బండిలో పెట్రోల్ పోస్తున్నప్పుడు ఫోనులో మాట్లాడుతుంటాడు. రీచార్జిలకు సంబంధించిన ఆ అప్లికేషను ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఏమి ప్రచారం చేస్తుంది? ఇది ఎంతవరకు కరెక్ట్? పెట్రోల్ బంకులో మొబైల్ ఫోన్ ఉపయోగించోద్దు అన్న కనీస నియమాన్ని పాటించాల్సిన బాధ్యత కరువైందా? ఇలా ఈ ఒక్క ప్రకటనే కాదు చాలా వస్తువులకు సంబదించిన ప్రకటనలు పరిధి దాటి ప్రచారాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకటనలు కేవలం వస్తువులను ప్రచారం చేయడానికి తప్ప పరోక్షంగా తప్పుదారి పట్టించకూడదు. ఇటువంటి సంస్థలపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీస్కోవాలి.

Note: Feature image is just for representational purpose only.

 

Leave a Reply