నగరం కాలుష్య రహితంగా చేయడమే లక్ష్యం

హైదరాబాద్ లో డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల వల్ల నగరంలో ఎక్కువగా కాలుష్యానికి కారణమవుతున్నాయని వీలైనంత త్వరగా నగరంనుంచి దూరంగా వాటిని తరలించడం ద్వారా నగరంలో కాలుష్యాన్ని నివారించాలని ప్రతిపాదనలను పరిశీలించి ఔటర్‌రింగురోడ్డు పరిధిలోకి తరలిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.2017 డిసెంబర్ నాటికి అన్ని డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల పరిశ్రమలను తరలిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.హైదరాబాద్ నగరం బయటకు వెళ్లే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు తీస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజల నివాస స్థలాలకు దూరంగా పరిశ్రమల ఏర్పాటు చేసేలా ఇకపై ఏర్పాటయ్యే పరిశ్రమల విషయంలో అప్రమత్తంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో పరిశ్రమల యజమానులతో కూడా సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ఈ విషయంపై వారితో కూడా చర్చిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Leave a Reply