సైకిల్ ఎక్కిన చిత్ర బృందం..

నిశాంత్ పుదూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం బొమ్మల రామారం. గతంలో విడుదల అయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఆగష్టు 12 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అన్ని చిత్రాల్లా కాకుండా తమ చిత్రం పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెప్తూ వస్తున్న చిత్ర యూనిట్, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ అడ్వర్టైజింగ్ కంపెనీ యాడ్ వేగాన్స్ కు చెందిన సైకిల్స్ పై ప్రచారాన్ని నిర్వహించారు. స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులే స్వయంగా సైకిల్స్ తొక్కుతూ ప్రచారం చేయడం పలువురిని ఆకట్టుకుంది. అంతా నూతన నటీనటులతో, పూర్తి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత నిశాంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రంలో సూరి, తిరువీర్,ప్రియదర్శన్,విమల్ కృష్ణ,జ్యోతివర్మ తదితరులు నటిస్తున్నారు. కార్తిక్ కొడకండ్ల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Bommala Ramaram Trailer: 

bommala ramarambommala ramaram bommala ramaram bommala ramaram bommala ramaram

Leave a Reply