పోలీస్ ..అంటే ఇలా ఉండాలి అని నిరూపించారు.

పోలీసులు, దేశ సైనికులకు ఉండాల్సిన తొలి లక్షణం సాహసం చేయడమే.. నిజమే ఆ సాహసం ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు ఉపకరిస్తుంది.పోలీసుల కంట్రోల్ రూమ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండబట్టే చాలా సందర్భాల్లో ఎన్నో ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడగలుగుతున్నారు. వరుస వర్షాలతో డిల్లీ నీటమునిగిన విషయం తెలిసిందే.భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మెహరౌలీ-బడర్‌పూర్ రోడ్‌లో పుల్ ప్రహ్లాద్‌పూర్ అండర్‌పాస్ వద్ద నీరు వరదలా పారుతుంది. ప్రమాదకరమైన ఆ మార్గం గుండా వెళ్తున్న స్కూల్ బస్సు లోకి నీరు చేరుతుంది.అయితే ఆ బస్సులో ఉన్న పిల్లలు, వారితో పాటు ఉన్న టీచర్లు ఏం చేయాలో తెలియక పోలీసు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ మురారీ లాల్ (39) వెంటనే స్పందించి వెంటంటే ఒక్కొక్కరిని బస్సునుండి తీసుకువచ్చి నీరు లేని వైపు ఉంచారు.ఇలా ప్రమాదంలో ఉన్న పిల్లలను కాపాడిన పోలీసు సాహసానికి తమ సహచరులు, స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply