తమిళ సినిమాల నుండి రజనీకాంత్ ను కాపాడండి…

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ పై తన దండయాత్రను కొనసాగిస్తుంది. సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, సినిమాకు వచ్చిన హైప్ మూలంగా ఇప్పటికి మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. అయితే చెన్నైకు చెందిన కంద స్వామి అనే వ్యక్తి కబాలిపై పోలీసులకు పిర్యాదు చేశారు. కబాలిపై విపరీతమైన ప్రచారం చేసినందువల్ల, 1200 రూపాయలు పెట్టి సినిమా చూశానని తెలిపారు. అయితే సినిమాలో 66 సంవత్సరాల రజనీకాంత్ తో చిత్ర విచిత్ర మైన విన్యాసాలు చేయించారని, దర్శకుడు తనను చిత్రవధ చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాత థానుపై, దర్శకుడు పా. రంజిత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, రజనీకాంత్ ను కూడా ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించి, తమిళ సినిమాల నుండి ఆయనను రక్షించాలని కందస్వామి తన పిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply