ఒప్పందం కుదుర్చుకోనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..

భారత దేశ చరిత్రలో తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాల పరస్పర అవగాహనతో ఒప్పందం కుదుర్చుకుంటున్న తొలి రాష్ట్రాలుగా తెలంగాణ – మహారాష్ట్ర చరిత్రకేక్కబోతున్నాయి. ఇక విషయానికి వస్తే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యేవి. అందువల్ల ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేక ఆగి పోవడం జరిగేది. అందుకు పరిష్కారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగునీటి రంగంపై దృష్టి పెట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. దానికి అనుగుణంగా నేడు రెండు రాష్ట్ర ప్రభుత్వాధినేతలైన కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య చారిత్రాక ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తెలంగాణలో నిర్మించబోయే ప్రాజెక్టుల వివరాలు:

  • గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజీ
  • ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ
  • పెన్ గంగ నదిపై చనకా – కొరటా బ్యారేజీ

Leave a Reply