ఇక రికార్డులు రిపేరు చేయడమే మిగిలింది…

జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలకు సిద్దం అవుతున్న సందర్భంలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా చిత్ర ట్రైలర్ లో పర్యావరణ సమస్యను చిత్రంలో చుపించానున్నట్లు చెప్పగానే సాధారణ ప్రేక్షకులతో పాటు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. రేపు విడుదల అవనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఈ రోజు అర్ధ రాత్రి నుండి ప్రదర్శించనున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ కోసం అభిమానులు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. చెన్నై లో బెనిఫిట్ షో టికెట్స్ ను వేలం వేయగా ఒక అభిమాని ఏకంగా 31000 రూపాయలకు కొన్నారు. కర్నాటక, కేరళలో కూడా అభిమానులు టికెట్స్ భారీగా కొంటున్నారు. రేపటినుండి ఆదివారం వరకు ఈ చిత్రం ప్రదర్శింపబడే అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశాయి. అంటే టికెట్స్ కోసం నాలుగు రోజులు వేచి ఉండాల్సిందే. పోటిగా వేరే సినిమాలు ఏవి లేక పోవడంతో ఈ నాలుగు రోజులు ప్రతి రోజు కనీసం 25 కోట్లు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటి వారంలోనే 100 కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకొని జనతా గ్యారేజ్ దండయాత్రకు దిగుతున్నట్లే.

 

 

 

Leave a Reply