మరోసారి వెనక్కి వెళ్ళిన బాహుబలి…

యంగ్ రెబెల్ స్టార్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఘనతను చాటి చెప్పుతూ వసూళ్ళ సునామీని సృష్టించింది. ఈ చిత్రానికి రెండో భాగం కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని 2016లో విడుదల చేద్దామనుకున్నారు. తర్వాత 2017 ఏప్రిల్ 14న తమిళ ఉగాది సందర్భంగా విడుదల అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు రెండవ భాగం మరింత వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ చిత్ర హిందీ హక్కులను కొన్న దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 28, 2017లో విడుదల చేస్తున్నట్లు కరణ్ జోహార్ వెల్లడించారు.

One thought on “మరోసారి వెనక్కి వెళ్ళిన బాహుబలి…

Leave a Reply