జూలై 1న విడుదలకు సిద్దమైన సూర్య “మేము”

సూపర్ స్టార్ సూర్య మరియు అమలాపాల్ జంటగా నటించి –  తమిళంలో ఘన విజయం సాధించిన “పసంగ-2” చిత్రాన్ని తెలుగులో అనువదించారు. బిందుమాధవి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.ఆ చిత్రానికి  “మేము” పేరును ఖాయం చేశారు. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో పాటు 2 డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తుంది. హీరో సూర్య ఈ చిత్రాన్ని స్వయంగా సమర్పిస్తుండడం విశేషం.”మేము” చిత్రం జూలై 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అర్రోల్ కొరెల్లి ఈ చిత్రానికి సంగీతం అందించగా శశాంక్ వెన్నెలకంటి మాటలు-పాటలు అందించారు.ఇప్పటికే గొప్ప సినిమాగా తమిళ్ లో పేరు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని నిర్మాతలు తెలిపారు.

Leave a Reply