త్వరలో రజని-రాజమౌళి కాంబినేషన్ తో సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంత్ నటించిన తాజా చిత్రం కబాలి.ఈ చిత్ర టీజర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తుంది. సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు అందరు ఈ టీజర్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేరారు.టీజర్ చుసిన అనంతరం ఆయన ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. తనకు రజనీకాంత్ తో పని చెయ్యడం ఒక కల అని, అయన అవకాశం ఇస్తే ఆయనకు కథ వినిపిస్తాను అని రాజమౌళి తెలిపాడు. కథ నచ్చితే రాజమౌళితో పనిచేయడానికి సిద్దం అని రజనీకాంత్ ఇది వరకే ప్రకటించాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రతి సినీ అభిమాని కోరుకునే కాంబినేషన్ ని మనం త్వరలోనే చూడొచ్చు.

Leave a Reply