డ్రగ్స్ అలవాటు నుండి దూరం చేస్తున్న బాహుబలి..

దేశంలో అనేకమంది రకరకాల మాద్రకద్రవ్యాలకు బానిస అయ్యారు. వాటి నుండి ఎలా బయటికి రాలేక కొంతమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బాగా డబ్బున్న వారు చికిత్స తీసుకుంటూ ఆ మాద్రకద్రవ్యాల నుండి విముక్తి పొందుతున్నారు. అయితే రోజు వారి కూలీలు, రిక్షా వాలాల పరిస్థితి ఏంటి? అందుకోసం న్యూ ఢిల్లీలో ఒక స్వచ్చంద సంస్థ విన్నుత్నంగా ఆలోచించింది. యమునా నది బ్రిడ్జి కింద తెరను ఏర్పాటు చేసి అందులో సినిమాలు చూపిస్తుంది. అందుకు ప్రవేశ రుసుముగా కేవలం పది రూపాయలను మాత్రమే నిర్ణయించింది. తాజాగా అందులో హిందీలో డబ్ చేసిన బాహుబలి సినిమాను ప్రదర్శించారు. అయితే కొన్ని సినిమాల నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ స్వచ్చంద సంస్థలు చేస్తున్న మంచి పనిని గుర్తించి అనుమతులు ఇచ్చారు. అలాగే పోలీసులు కూడా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏమి జరగడం లేదని నిర్దారించుకొని అనధికారికంగా ప్రదర్శనకు సహకరిస్తున్నారు.

Leave a Reply