పాకిస్థాన్ కు మర్యాద తెలియదు.

సార్క్ సమావేశంలో భాగంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్ళి వచ్చిన భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు రాజ్యసభలో పాకిస్థాన్ పర్యటన గురించి తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోశారు. ఇస్లామాబాద్ లోని లగ్జరీస్ సెరెనా హోటల్ లో జరిగిన సార్క్ సమావేశానికి అందరిని అనుమతించిన పాక్ ప్రభుత్వం, తనతో పాటు వచ్చిన ప్రతినిధులను, మీడియా వారిన మాత్రం అనుమతించలేదని, ఈ విషయాన్ని చెప్పడానికే తనకు ఇబ్బందిగా ఉందని రాజ్ నాథ్ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని పిలుపునిచ్చానని, మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండవని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాని, అరికట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఒక దేశానికి ఉగ్రవాది మరొక దేశానికి అమరుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తన ప్రసంగాన్ని పాకిస్థాన్ మీడియా బ్లాక్ చేసిన సంగతి తనకు తర్వాత తెలిసిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పాక్ హోం మంత్రి తనను లంచ్ కు పిలిచి ఆయన కారులో వెళ్ళిపోయారు. అతిథిని ఆహ్వానించినప్పుడు అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలి. అది మన భాద్యత కూడా. కాని పాకిస్థాన్ అదేమీ చేయలేదని,పాకిస్థాన్ ప్రవర్తనకు లంచ్ చేయకుండానే ఇండియాకు తిరిగి వచ్చానని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

అనంతరం మాట్లాడిన వివిధ పార్టీల నేతలు పాకిస్థాన్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. తిరిగి మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ మన ప్రధాని చాలా కాలంగా పాకిస్థాన్ తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కాని పాకిస్థాన్ బుద్ది మాత్రం మారడం లేదని వివరించారు. మనం కుదిరితే మన స్నేహితులను మార్చుకోవచ్చు, కాని ఇరుగు పొరుగు వారిని మార్చుకోలేమని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply