వేగం పెంచిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రం అతని కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచినా మహేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు మహేష్ బాబు డేట్లు అన్ని ఫుల్ అయిపోయాయి. ఆయన నటించబోయే తర్వాతి చిత్రాల ఫస్ట్ లుక్ లను నేడు మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అవన్నీ కూడా పెద్ద దర్శకులు, నిర్మాతలతోనే. మురుగదాస్ చిత్రం తర్వాత మహేష్ బాబు చేయబోయే 4 చిత్రాల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తొలిసారిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, పీవీపీ నిర్మాతగా మహేష్ బాబు చిత్రం చేయనున్నారు. తన కెరీర్ లోనే శ్రీమంతుడు రూపంలో అతిపెద్ద హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా చిత్రం చేయనున్నారు. శ్రీమంతుడు చిత్రానికి తనతో పాటు నిర్మాతలుగా వ్యవహరించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. అలాగే దూకుడు నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కూడా చిత్రం చేయనున్నారు. ఇది వరకే పురిజగాన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు కనుక మొత్తం 5 చిత్రాలను మురుగదాస్ చిత్రం తర్వాత మహేష్ చేయనున్నారు.

Leave a Reply