సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీరస్తు శుభమస్తు

అల్లు శిరీష్‌,  లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం విడుదలకు సిద్దమైంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన‌ ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా ఉన్న ఈ చిత్రానికి ప‌రుశురామ్‌(బుజ్జి) దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రాలతో మంచి అంశాన్ని వెండితెర‌పై చూపగలిగే ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌.ఈయన దర్శకత్వంలో వస్తున్న శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాలను గురించే కావడం గమనార్హం.ఈ మధ్యే విడుదలైన టీజ‌ర్ కి చాలా మంచి స్పందన లభించింది. అతి త్వ‌ర‌లో శ్రీరస్తు శుభమస్తు ఆడియో విడుద‌ల కానుంది. అనంతరం శ్రీరస్తు శుభమస్తు సెప్టెంబ‌ర్ 16న తెలుగు తెరపైకి రానున్నట్లు అధికారికంగా శ్రీరస్తు శుభమస్తు చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు కీలక పాత్రలలో నటించారు.

Leave a Reply