చుక్కలు చూపించిన నిర్మాతల మండలి..

నాని నటించిన జెంటిల్ మన్ చిత్రంతో తెలుగున్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి నివేదా థామస్. తొలి చిత్రంతోనే  అందం అభినయంతో మంచి మార్కులు తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే నానితో పోటాపోటీగా నటించింది. ఈ సినిమాతో తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకేక్కే సినిమాలో నివేదా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నివేదా జెంటిల్ మన్ సినిమా కన్నా ముందు నవీన్ చంద్ర సరసన ‘జూలియట్ – లవర్ ఆఫ్ ఇడియట్’ అనే చిత్రానికి సైన్ చేసింది.  అయితే అనుకోని కారణాల చేత ఆ ప్రాజెక్ట్ మొదలవ్వలేదు. అదే సమయంలో విడుదలైన జెంటిల్ మన్  నివేదితకు మంచి పేరుతో పాటు ఆఫర్లు రావడంతో ఇటీవల ప్రారంభం అయిన ‘జూలియట్ – లవర్ ఆఫ్ ఇడియట్’ చిత్రాన్ని పూర్తీగా వదిలేసి కాల్ షీట్స్ ఇవ్వకుండా దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. దాంతో నిర్మాత, నిర్మాతల మండలిలో పిర్యాదు చేయడంతో వారు విచారణ జరిపి సినిమా చేయకుంటే సౌత్ సినిమాలలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో నివేదా చేసేదేం లేక ‘జూలియట్ – లవర్ ఆఫ్ ఇడియట్’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నది.

Leave a Reply