మాస్టర్ కు సహకరించనున్న తెలుగు సినీ పెద్దలు

నిన్న తిరుమలకు ఐదు మంది ప్రముఖ వ్యక్తులు ఒకేసారి రావడం పెద్ద విశేషమే అయ్యింది. వారెవరో కాదు క్రికెట్ దిగ్గజం సచిన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్,ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. వారంతా ఒకే సారి తిరుమలకు రావడం యాద్రుచ్చికమా లేక కలిసి వచ్చారా అనేది చర్చనీయాంశం అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారంతా కలిసే వచ్చారు. అది కూడా వారి వ్యాపారానికి సంభందించిన అగ్రీమెంట్లను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కుదుర్చుకునేందుకు వచ్చారు. ఇక విషయానికి వస్తే సచిన్ ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్ కు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సచిన్ భాగస్వామి అయిన పివిపి సంస్థ కేరళ బ్లాస్టర్స్ నుండి తప్పుకోవడంతో సచిన్ కొత్త భాగస్వామిని వెత్తుకునే పనిలో పడ్డాడు. అందుకు నాగార్జున, చిరంజీవి,అల్లు అరవింద్,నిమ్మగడ్డ ప్రసాద్ మొదలైన వారు సచిన్ కు భాగస్వామిగా ఉండేందుకు ముందుకు రావడంతో సచిన్ తన సంస్థను మరింత విసృతపరచేందుకు తిరుమలలో అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply