మహారాష్ట్ర గవర్నర్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా ?

మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ను విభిన్న సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నారా? ఈ ప్రశ్న ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో మొదలైంది. ఎందుకంటే కథకి తగ్గట్టుగా పాత్రలను ఎంచుకోవడంలో మన రామ్ గోపాల్ వర్మ డి అందె వేసిన చేయి అని చెప్పచ్చు. కాని తెలంగాణ లో పుట్టి మహారాష్ట్ర గవర్నరుగా బాధ్యత నిర్వర్తిసున్న విద్యాసాగర రావు ను సినిమాలో చూపించాలనే ఆలోచన రాం గోపాల్ వర్మ కి కలిగిందా? ఒకవేళ నిజంగా ఆ ఆలోచన ఉంది కాబట్టే రామ్ గోపాల్ వర్మ ఆయనను కలిసారా అనే ప్రశ్న ఇప్పుడిప్పుడే మొదలైంది. తన తదుపరి చిత్రం గవర్నమెంట్ అనే టైటిల్ ఖరారు చేసి పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ,రాజకీయాలకు సంబంధించింది.అయితే ఆ తర్వాత ఏమైనా సినిమా తీయాలనే యోచనలో ఉన్నారో లేక అదే సినిమాకి సంబంధించి ఏదైనా పాత్ర చేస్తారని అడిగారో తెలీదు కాని వీరిద్దరూ కొంతసేపు చర్చలు అయితే జరిపారు. ఎక్కడంటారా? ముంబాయి బీచ్ రోడ్డులో వాకింగ్ కి వెళ్తూ ఎదురుపడిన వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఈ అంశం కేవలం సంభాషణ మాత్రమేనా లేదా సినిమా గురించిన చర్చ అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply