ఇస్రో అరుదైన ఘనత..!

ఇస్రో శ్రాస్త్రవేత్తలు మరో అధ్బుత విజయాన్ని నమోదు చేశారు. ఒకేసారి గగన తలంలోకి 20 ఉప గ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ఎల్వీ-సీ34 రాకెట్, కార్టోసాట్-2 వ్యోమనౌకలో 20 ఉపగ్రహాలను దిగ్విజయంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉప గ్రహాలలో 3 స్వదేశీ ఉపగ్రహాలు కాగా మిగిలిన ౧౭ విదేశీ ఉపగ్రహాలు. 48 గంటల కౌంట్ డౌన్ తర్వాత ఈ రోజు ఉదయం 9 గంటల 26 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ34 రాకెట్ పొగలు విరజిమ్ముతూ ఆకాశంలోకి ఎగిరింది. దాంతో ఉస్రో శాస్త్రవేత్తల సంతోషం అంబరాన్నితాకింది. ఉపగ్రహాల మొత్తం బరువు 1200 కిలోలు.

.isro pslv isro

Leave a Reply