కేంద్రానికి నితీష్ సూచన..!

నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యోగా దినోత్సవాన్ని బీహార్ ప్రభుత్వం బహిష్కరించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. దేశంలో మద్యపాన నిషేధం చేసి ఆ తర్వాత యోగా దినోత్సవం చేయాలని ప్రధానిని నితీష్ కోరిన విషయం తెలిసిందే. దానికి ప్రధాని నుండి ఎటువంటి స్పందన రాలేదు. అందుకు నిరసనగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని బీహార్ ప్రజలు బహిష్కరించాలని నితీష్ పిలుపునిచ్చారు. ఇదే రోజు ప్రపంచ సంగీత దినోత్సవం కూడా ఉండడంతో, సంగీత దినోత్సవాన్ని బీహార్ లో ఘనంగా నిర్వహించబోతున్నారు.

Leave a Reply