కేసుల నుండి తప్పించుకోవడానికి కొత్త నాటకమా..?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో కొత్త నాటకానికి తెర తేశాడా అంటే అవుననే అంటున్నాయు రాజకీయ వర్గాలు. గత కొంత కాలంగా ముద్రగడ కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తునిలో నిర్వహించిన సభలో విధ్వంసం చెలరేగింది. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్ష్ప్రెస్స్ రైలుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై సిఐడి విచారణకు ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారి చేసింది.   సిఐడి ప్రధాన నిందితుడిగా ముద్రగడను పేర్కొనడంతో పాటు, మిగతా నిందితులను అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.అయితే నిందితులను కాపాడడానికి ముద్రగడ మరో కొత్త నాటకానికి తెరలేపారు. తనకు తాను ఇంట్లో బంధీగా ఉంటూ నిందితులపై కేసులు ఎత్తి వేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పురుగుల మందు తాగుతా అంటూ హడావిడి చేశారు. చూడాలి మరి ఈ విషయంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.

Leave a Reply