జగన్ వ్యూహం ఫలించిందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున నాలుగో అభ్యర్థిని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చివరి వరకు విశ్వ ప్రయత్నం చేశారు. కేవలం ఇప్పటికే వైసిపి నుండి వచ్చిన ఎమెల్యేలను, మరింతమంది ఎమేల్యేలను ఫిరాయింపులకు ప్రోస్తహించడానికే  చంద్రబాబు నాలుగో అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నం చేశాడు. అయితే చంద్రబాబు ప్రయత్నాలను వైసిపి అధినేత జగన్ సమర్థవంతంగానే తిప్పికొట్టినట్లు కనిపిస్తున్నాడు. జగన్ తన శాసనసభ్యులతో నిత్యం అందుబాటులో ఉంటూ వారు చేజారి పోకుండా చూసుకున్నాడు. మరోవైపు తెదేపాలో చేరిన శాసనసభ్యులు కూడా పునరాలోచనలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 6 గురు ఎమెల్యేలు తిరిగి వైఎసార్సిపిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైఎసార్సిపి నేతలు చెప్పడంతో అనవసరంగా అభ్యర్థిని నిలిపి పరువు పోగొట్టుకోవడం ఎందుకని చంద్రబాబు నాలుగో అభ్యర్థిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.

Leave a Reply