ఆకుపచ్చ తెలంగాణనే లక్ష్యం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుండి సాధారణ పౌరుల వరకు అందరూ తమ వంతుగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా జూలై 21న తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆకు పచ్చగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకు తమ వంతుగా 10 వేల కిలోమీటర్ల మేర మొక్కలు నాటబోతున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలవడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం అని, అటువంటి ముఖ్యమంత్రిపై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, జైపాల్ రెడ్డిలు, తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు, మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారు అని జూపల్లి విమర్శించారు.

Leave a Reply