తండ్రి సిఎంగా ఉన్నప్పుడే లక్ష కోట్లు సంపాదించాడు

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు అని  వివేకా అన్నారు. జగన్ కు నేను, నాది అనే మాటలు తప్ప, మనం, మనది అనే మాటలు రావన్నారు. జగన్ కు ఉన్న  అహంకారం వల్లే ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. తల్లిని కూడా బలిపశువును చేసిన దుర్మార్గుపు వ్యక్తి  జగన్ అని వివేకా మండిపడ్డారు. ఓట్లు వేసిన జనంపైనా కూడా కాగన్ కు అభిమానం లేదన్నారు. జగన్ దృష్టి అంతా  డబ్బుపైనే అని వ్యాఖ్యానించారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు లక్షకోట్లు దోచిన వ్యక్తి జగన్ అని, తానే సీఎం అయి మరిన్ని కోట్లు దోచుకోవాలన్నదే అతని ఆలోచన అని వివేకా ఆరోపించారు.

Leave a Reply