తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చంద్రబాబుకు అసూయ అని అందుకే ఆయన విగ్రహాలు కనిపించకూడదని వైఎస్ విగ్రహాలు తొలగిస్తున్నారని తెలిపారు. విదేశీయుల మోజుతో జాతిపిత గాంధీ విగ్రహాలు కూడా తొలగించి కాల్వలో పడేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వేటిని వదలకుండా కూల్చి వేస్తున్నారని, మహాత్ముల విగ్రహాలను కూడా తొలగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీయుల విగ్రహాలను పెట్టాలనుకుంటున్నారా అని అంబటి ప్రశ్నించారు.మహాత్మా గాంధీని చంపిన గాడ్సేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంబటి విమర్శించారు. శిశుపాలుడు చేసిన తప్పులను లెక్కించి కృష్ణుడు శిక్ష వేసిన విధంగా, చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు లెక్కించి శిక్ష వేస్తారని అంబటి రాంబాబు తెలిపారు.

Leave a Reply