ఈ విషయంలో అగ్రభాగాన ఆంధ్ర ప్రదేశ్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే రాజధానిని ఏర్పాటు చేసుకొని, అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రం. అక్కడి పాలకులు కూడా అభివృద్ధిపై చిత్త శుద్దితో ఉన్నట్లే కనబడుతున్నారు. అయితే పాలకులు ఎంతగా ప్రయత్నించినా అధికారులు మాత్రం అందుకు సహకరించడం లేదని తెలుస్తుంది. అందుకు వారిలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడమే కారణం. ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్’ సంస్థ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం 74.3 శాతం అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఏపి తర్వాత 73.1 శాతంతో తమిళనాడు రెండవ శాతంతో ఉంది. అలాగే ప్రస్తుతం ఏపి పెట్టుబడులకు ఏ మాత్రం అనుకూలంగా లేదని, అందుకు అధికారుల అవినీతే కారణం అని నివేదికలో పేర్కొన్నారు.

Leave a Reply