ఆంధ్ర ప్రదేశ్ లో రైల్లో నీటిని తెచ్చుకుంటున్న ప్రజలు..

మహారాష్ట్రలోని లాతూర్ పట్టణం గుర్తుందా? ఈ ఏడాది వచ్చిన తీవ్రమైన కరువుకు విలవిల్లాడిన ప్రాంతం అది. కరువు సమస్యను తగ్గించడానికి ఏకంగా రైళ్ళ ద్వారా మంచి నీటిని సరఫరా చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. లాతూర్ స్థాయిలో కాకున్నా ఆంధ్రప్రదేశ్ లోని దొనకొండ ప్రాంత ప్రజలు అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. దొనకొండ ప్రాంతానికి నీటిని అందించే చంద్రవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అడుగంటి పోవడంతో ప్రజలు రైళ్ళలో ప్రజలు 20 కిలోమీటర్ల దురం ప్రయాణించి గజ్జల కొండకు వెళ్లి అక్కడినుండి నీటిని తెచ్చుకుంటున్నారు. దాదాపు ఒక నెల రోజుల నుండి దొనకొండలో ఇదే పరిస్థితి ఉంది.

Leave a Reply