అమరావతి నుండి పరిపాలన ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తానికి అనుకున్నది సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్ లో పరిపాలన కొనసాగించేందుకు వీలున్నా చంద్రబాబు మాత్రం ఉద్యోగులను అమరావతికి తరలి రావాలని, అక్కడ నుండే పరిపాలన కొనసాగాలని ఆదేశించారు. అయితే అమరావతిలో తాత్కాలిక సచివాలయ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఉద్యోగుల్లో కొద్దిగా అనుమానాలు ఉండేవి. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి భావన నిర్మాణాలను పరిపాలనకు అనువుగా మార్చారు. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నప్పటికీ మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో తాత్కాలిక సచివాలయాన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply