ఓటుకు నోటు కేసులో కోర్టు సంచలన తీర్పు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తీసుకుంది. తెలంగాణలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు స్టీఫెన్ సన్ తో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది. అప్పట్లో విచారణ వేగంగా కొనసాగినా ఎందుకనో తర్వాత నెమ్మదించింది. దాంతో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. ఆడియో టేపులో ఉన్న వాయిస్ చంద్రబాబుదా? కాదా? అనేది విచారణ జరిపించాలని ఏసీబీ డీజీని కోర్ట్ ఆదేశించింది. సెప్టెంబర్ 29లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply