ఇప్పటికైనా మన నేతలు మారతారా..?

ఒడిషాలో  గత వారం జరిగిన ఒక సంఘటన అందరి మనసులను కలచివేసింది. దన మాఝీ అనే వ్యక్తి భార్య చనిపోతే, భార్య పార్థీవ దేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్సు నిరాకరించడంతో 10 కిలోమీటర్లు మోసులేల్లారు. ఈ వార్త సోషల్ మీడియాలో చుసిన బహ్రయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చలించిపోయారు. వెంటనే బహ్రయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి దన  మాఝీకి ఆర్ధిక సహాయం చేశారు. అయితే ఎక్కడో బహ్రయిన్ దేశ ప్రధాని స్పందించారు కాని ఇప్పటి వరకు మన దేశ నేతలు ఎవరు స్పందించలేదు. కనీసం ఆయనను చూసి అయినా మన నేతలు మారతారని ఆశిద్దాం.

Leave a Reply