బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ మధ్య బాలకృష్ణ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో హీరోయిన్ల గురుంచి తప్పుగా మాట్లాడి విమర్శల పాలైన బాలకృష్ణ ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు తెలన్నం తెలియదు అనే విధంగా మాట్లాడారు. 56వ పుట్టిన రోజు వేడుకలను అమెరికాలో ఘనంగా జరుపుకున్న బాలకృష్ణ, ఎన్టిఆర్ గొప్పతనం గురుంచి అక్కడి వారికి చెబుతూ, దేశంలో ఆహార భద్రతను 1983లోనే ఎన్టిఆర్ ప్రవేశపెట్టాడని, తెలంగాణ విషయం ఐతేనేం అసలు తెల్ల అన్నమంటే తెలియని వాళ్ళకి అన్నం తినేలా చేసింది ఎన్టిఆర్ అని చెప్పుకొచ్చారు. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండి పడుతున్నారు. ఒకప్పుడు భారత దేశానికి వరి పంటను ఎగుమతి కేవలం తెలంగాణ నుండే జరిగేదని బాలకృష్ణ తెలుసుకోవాలని వారు సూచించారు.

Leave a Reply