కేసీఆర్ కు బీజేపీ నేతల సూచన…

ఉమ్మడి హై కోర్ట్ విభజన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయాలని నిర్ణయించుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హై కోర్ట్ విభజన జరగక పోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కారణం అని, అమరావతిలో హై కోర్ట్ కి స్థలాన్ని ఎందుకు కేటాయించరని చంద్రబాబును కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని లక్ష్మణ్ నిలదీశారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హై కోర్ట్ విభజన నాటకం తెర పైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నిజంగా విభజన కోరుకుంటే ఢిల్లీలో కాకుండా అమరావతిలో దీక్ష చేయాలని లక్ష్మణ్ సూచించారు.

Leave a Reply