ఇచ్చిన హామీలను మరచిపోయారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ టవర్లు నిర్మిస్తామని, 100 రోజుల ప్రణాళికతో హైదరాబాద్ నగర రూపు రేఖలు మారుస్తామని ప్రకటించారు.వాటిని ప్రకటించి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి పనులు కూడా మొదలు పెట్టనే లేదు. అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డి ఈ విషయాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ టవర్ల నిర్మాణం ఏమైందని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళతో నింపుతాం అన్నారు, కొబ్బరి నీళ్ళు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. 100 రోజుల ప్రణాళిక మాటలకే పరిమితమా అని ప్రశ్నించారు. పేరుకే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సమస్యలనే మరచి పొయింది, ఇక హామీలు ఏం గుర్తుంటాయి అని విమర్శించారు. జీహెచ్ఎంసీ నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Leave a Reply