సంక్షేమ పథకాల వల్లే ఇదంతా – బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత,విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు అని విమర్శించారు. రూపాయికే కిలో బియ్యం,ఉచిత పథకాలు, సరకులపై సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోయి బద్దకస్తులుగా, పనికిమాలినవాళ్ళుగా తయారయ్యారని ఆరోపించారు. గ్రామాల్లో ఏదైనా పనికి మనుషులు కావాలంటే దొరకడం లేదని, అంతా ఉపాధి పనులకు వెళ్తున్నారని, దాంతో పనులకు ఆటంకం కలుగుతుందని, వెంటనే ఉపాధి పనులను నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే ఉచిత పథకాలను నిషేధించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply