తెరాసను వీడనున్న తెలంగాణ మంత్రులు : బీజేపీ ఎమెల్యే ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయా అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటి వరకు మిగతా పార్టీ నేతలు, ఎమెల్యేలు అధికార తెరాసలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు తెరాసకు భారి షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు కాషాయ పార్టీ నేతలు. ఏకంగా మంత్రుల స్థాయి నేతలే తెరాసను వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. దీనిని బీజేపీ ఎమెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ధ్రువీకరించారు. త్వరలోనే మంత్రుల పేర్లను బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. దాంతో తెరాసను వీడబోతున్నమంత్రులు ఎవరనేది ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a Reply