అసెంబ్లీలో బెంచ్ ఎక్కిన బిజేపి ఎమెల్యే

శాసన సభలో ప్రతిపక్ష ఎమెల్యేలు నిరసన తెలపడం సాధారణ విషయం. నిరసన తెలిపే క్రమంలో ఎమెల్యేలు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు పోడియం చుట్టు ముట్టడం లాంటి పనులు చేస్తుంటారు. అయితే అందరు ఎమెల్యేలకు భిన్నంగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష బిజేపి ఎమెల్యే విజేందర్ గుప్తా వినూత్నంగా నిరసన తెలిపారు. తనకు మైక్ ఇవ్వాలన్న వినతిని స్పీకర్ రాం నివాస్ గోయల్ నిరాకరించడంతో విజేందర్ గుప్తా తీవ్రంగా నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని బెంచ్ ఎక్కి అందరికి షాక్ ఇచ్చారు. విజేందర్ తీరుపై ముఖ్యమంత్రి కేజ్రివాల్ మండిపడ్డారు. విజేందర్ చేసినది అనైతికమని విమర్శించారు.

 

 

Leave a Reply