ఐఐటి అడ్మిషన్ ఎలా పొందావో త్వరలోనే బయటపెడతా..

బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి తెలియని వారుండరు.జయలలిత పైన అవినీతి కేసు పెట్టి గత కొంత కాలంగా రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ పై కాస్తంత పట్టు ప్రదర్శించి తనని వరుసగా రెండోసారి ఆర్బిఐ గవర్నర్ గా అవకాశం ఇవ్వద్దంటూ గట్టిగానే పోరాడారు. ఇప్పటికే రాజన్ కూడా తను మరల గవర్నర్ గా చేయలేనని స్పష్టం చేసారు. అయితే ఇప్పటికి ఈ విషయంలో దాదాపు విజయం సాధించిన సుబ్రమణ్యస్వామి ఇప్పుడు కేజ్రివాల్ పై బాణం ఎక్కుపెట్టారు. కేజ్రివాల్ జీవితం నకిలీ అని త్వరలో తన ఉన్నత విద్య గురించిన రహస్యాలను బయటపెడతామని ఆయన అన్నారు. తాను ఐఐటిలో చదివానని గొప్పగా చెప్పుకొనే కేజ్రివాల్ కు ఐఐటి అడ్మిషన్ ఎలా లభించిందో తనకు తెలుసనీ పూర్తి ఆధారాలు త్వరలోనే బయటపెడతానని ఆయన అన్నారు.

Leave a Reply