సత్య నాదెళ్ళను ఐటి వైపు నడిపించింది చంద్రబాబేనా..?

మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ ఎందుకు ఐటి చదువుకున్నాడు? ఎప్పుడు చదువుకున్నాడు? వంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలో చేసిన ప్రసంగాన్నివినండి. ఆ ప్రసంగంలో చంద్రబాబు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇక అసలు విషయానికి వస్తే కోతలు కోయడంలో ఈ భూమ్మీద నెంబర్ వన్ అయిన చంద్రబాబు, తన వల్లే సత్య నాదెళ్ళ ఐటి చదివాడని, అందువల్లే సత్య నాదెళ్ళకు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తన దగ్గర అప్పుడు పని చేస్తున్న సత్య నాదెళ్ళ తండ్రి యుగేందర్ ఐపిఎస్ తనతో చెప్పినట్లు చంద్రబాబు పేర్కొన్నాడు.  అసలు చంద్రబాబు ముక్యమంత్రి అవడానికి ముందే సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ లో చేరాడు, అతని తండ్రి యుగేందర్ ఏపి నుండి బదిలీపై వెళ్ళిపోయాడు. మరి అటువంటప్పుడు బాబు వాళ్ళ సత్య నాదెళ్ళ ఐటి ఎప్పుడు చదువుకున్నాడు, ఎలా మైక్రోసాఫ్ట్ లో చేరాడు, ఆ విషయం సత్య నాదెళ్ళ తండ్రి చంద్రబాబుకు ఎలా తెలిపాడు? అనే విషయాలు వైఎసార్సిపి ఎమెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈ విడియోలో చుడండి.

Leave a Reply