కేసీఆర్ అసమర్థత వల్లే ఇలా జరుగుతుందా..?

తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఉమ్మడి హై కోర్టు విభజన అంశం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తెరాస, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తెరాస అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హై కోర్టు విభజనపై కేంద్రాన్ని, చంద్రబాబును ఒప్పించలేక పోవడం కేసీఆర్ అసమర్థతే అని పొన్నం పేర్కొన్నారు. కేసీఆర్ విఫలమవడం వల్లే న్యాయవాదులు రోడ్డుకు ఎకాల్సి వచ్చింది అని పొన్నం ఆరోపించారు. హై కోర్ట్ విభజన కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్న కేసీఆర్ దమ్ముంటే విభజన పూర్తయ్యాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.

Leave a Reply