కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితిలో ఉంది. అలాగే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎంతో కొంత గుర్తింపు ఉండేది. అయితే తెలంగాణ నాయకుల మధ్య ఐఖ్యత లేకపోవడం, ఎవరికీ వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉహించుకొని, ఒకరికి ఒకరు వెన్నుపోట్లు పొడుచుకుంటూ తమ పార్టీ పతనానికి దారి తీశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఉండకూడదు అనుకున్నారు ఏమో గాని, ప్రతిపక్ష నేత జానారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని, తాను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతానని జానారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply