జైరాం రమేష్ ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేత..

ఆదిలాబాద్ లో రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ నేతలు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన వారు తిరిగి పార్టీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రైతుల రుణాలు ఒకేసారిగా మాఫీ చేయకుండా విడుతల వారిగా ఎందుకు మాఫీ చేస్తున్నారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చినందు వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని వీహెచ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై జై రాం రమేష్ పుస్తకం ఎందుకు రాశారని, ఆయనను ఎవరు రాయమన్నారని వీహెచ్ ప్రశ్నించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హై కమాండ్ ను కోరారు.

Leave a Reply