వారి చూపు ఫాం హౌస్ పై పడ్డదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్రాంతి కోసం మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలోని ఫాం హౌస్ కు తరచుగా వెళ్తుంటారు. కొన్ని సమయాల్లో అక్కడి నుండే పాలనా పరమైన, పార్టీ పరమైన నిర్ణయాలు చేస్తుంటారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావటమే వార్తగా మారిందని, ఆయన ఫాం హౌస్ రహస్యం అతి త్వరలో బయటపెడతామని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం రావటం అంటే తెరాస పార్టీకి రావటమా, రాష్ట్రానికి ఆర్ధిక స్థిరత్వం రావటం అంటే, కెసిఆర్ కుటుంబానికి రావటమా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలోనే మద్యం అమ్మకాల్లో, రాజకీయ వలసలను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికే వలసలతో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పార్టీ మారేవారు కాసులు, కాంట్రాక్టుల కోసమే వెళ్తున్నారని అన్నారు. అయితే తాజాగా జీవన్ రెడ్డి , ఇతర కాంగ్రెస్ నాయకులు ఫార్మ్ హౌస్ పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది అందుకే ఫార్మ్ హౌస్ రహస్యాన్ని త్వరలోనే ప్రజలకు చెప్తామని జీవన్ రెడ్డి అన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply