కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..

ఆరోపణలు నిరుపించక పోతే జైలుకు పంపిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మంది పడుతున్నారు. తమ దగ్గర సాక్షాలు ఉన్నాయని అవి తప్పకుండ బయట పెడతామని వారు తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అవినీతి చేస్తున్నారని, కేసీఆర్ ను ప్రజలే జైలుకు పంపుతారని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాజెక్టుల్లో సొమ్ము కాజేయదానికే రీ డిజైన్ పేరుతో ప్రాజెక్టులను మార్చారని వీహెచ్ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ లేఖలు రాసిన విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండక పోతే కేసీఆర్ కు దరిద్రం పట్టేదని, అటువంటిది కాంగ్రెస్ పార్టీని దారిద్ర పార్టీ అంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతలను ఒక్కరిని జైల్లో పెట్టిన ఆరోజే తెరాస పతనం ఆరంభం అవుతుందని వీహెచ్ మండిపడ్డారు.

Leave a Reply