గో వధ నిషేధ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి..

తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అసలైన గో రక్షకులు ప్రజలపై దాడి చేయరు, దాడి చేసే వారు నకిలీ గో రక్షకులు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై గో రక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన గోపాలన్ ఏవమ్ పశువధన్ సంవర్ధన్ బోర్డు చైర్మన్ మహా మండలేశ్వర్ స్వామి అఖిలేశ్వరానంద గిరి మాట్లాడుతూ పురాణాల్లో యుద్ధాలు కాని, 1857 సిపాయిల తిరుగుపాటు కాని ఆవుల కోసమే జరిగాయని ఆయన తెలిపారు. అందుకోసం ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆవు కోసం మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. గోవులను వాహనాలలో తరలిస్తున్నప్పుడు, అవి గాయపడినప్పుడు, మరణించినప్పుడు గో రక్షకులు సహజంగానే ఆగ్రహిస్తారని, అటు వంటి సమయంలో దాడులు చేయడం సహజమేనని పేర్కొన్నారు. అటువంటి సమయాల్లో గో రక్షకులు దాడి చేయకుండా, పోలీసులు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. గో వధ నిషేధ చట్టాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని అప్పుడే ఆవుల అక్రమ రావాణను అరికట్టవచ్చు అని పేర్కొన్నారు. ఆవుల పాలు, పేడ, మూత్రంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి అని, అవి కాన్సర్, మూర్ఛ వంటి రోగాలను సైతం నయం చేస్తాయని మహా మండలేశ్వర్ స్వామి వివరించారు.

Leave a Reply