పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక జోకర్….

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. కాపుల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహార దీక్షకు పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అరాచకం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు హీరోలా వచ్చి జీరోలా వెళ్తుంటారు అని ఎద్దేవా చేశారు. జిమ్మిక్కులు చేసే పవన్ కళ్యాణ్ చెప్పే నీతి మాటలు వినడానికి ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

Leave a Reply