సొంత నియోజకవర్గ ప్రజలనే కొట్టించిన ఘనుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం పార్టీ నేత, పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భూ నిర్వాసితుల కమిటీ అధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బృందాకారత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేంద్ర భూ సేకరణ 2013 చట్టం ద్వారా  కాకుండా మోదీ దొంగ చాటుగా తీసుకురావాలనుకున్న జీవో 123 ద్వారా భూ సేకరణ చేస్తూ తెలంగాణలో మోదీ ప్రతినిధిగా కేసీఆర్ నిలిచారని బృందాకారత్ విమర్శించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలనే పోలీసులతో కొట్టించిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు.  [pullquote]రైతులను, నిర్వాసితులను పోలీసులతో కొట్టిస్తూ అప్రజాస్వామికంగా భూములను లాక్కుంటూ బంగారు తెలంగాణ సాధించలేరు [/pullquote]అని తెలిపారు. కేసీఆర్ తన దృష్టి కోణాన్ని మార్చుకొనేందుకు నియోజకవర్గ ప్రజలు కళ్ళజోడు కొనిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది 500 రూపాయలు విరాళాన్ని కేసీఆర్ కళ్ళజోడు కోసం ఇచ్చారు.

Leave a Reply