చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం…

ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికల హడావిడి నెలకొన్న సంగంతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా పోటీ ఎన్డీయే కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన యూత్ మ్యానిఫెస్టోపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. సిక్కు మతస్తులు పరమ పవిత్రంగా భావించే ‘హర్మందర్ షాహిబ్’ ఫోటోలతో యూత్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అయితే దీనిపై పంజాబ్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో చేసిన తప్పును గమనించిన ఆప్ నేతలు ప్రాయశ్చిత్తం చేసుకునేందు, పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ సందర్శించి, అక్కడి వంట పాత్రలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సిక్కు మతస్థులకు క్షమాపణలు కోరారు.

Leave a Reply