తెలంగాణకు డిప్యూటీ సిఎంగా వివేక్..

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో భారి మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక మంది ఎమెల్యేలు పార్టీలో చేరారు. వారిలో కొంతమంది మంత్రి పదవి హామీతోనే వచ్చారు అన్న ప్రచారం జరుగుతుంది. ఐతే రాష్ట్రంలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం 19 మంది మంత్రులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 19 మంది మంత్రులతో క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఉంది. వారిలో కొంత మందిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రి వర్గంలో చేరే వారిలో ప్రధానంగా కొండా సురేఖ, కొప్పుల ఈశ్వర్, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నుండి తిరిగి తెరాసలో చేరిన వివేక్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయనకు ఏకంగా డిప్యూటీ సిఎం పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సిఎంగా ఉన్న కడియం శ్రీహరిని శాసన మండలి చైర్మన్ చేసి, ఆయన స్థానంలో వివేక్ కు అవకాశం ఇవ్వబోతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు స్వామి గౌడ్ కు  కుడా మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply