Devineni Sensational Comments on Telangana

తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ భారి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను తెలంగాణ పాటించటం లేదని ఆరోపించాడు.ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తుందని, తెలంగాణ నేతలు అనవసరంగా ఢిల్లీకి వెళ్లి రాద్దాంతం చేస్తున్నారని దేవినేని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 299 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిల కృష్ణా నీటి కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాలు పాటించరా అని తెలంగాణ ప్రభుత్వాన్నిప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం సాగు,తాగు నీటి అవసరాలకు నీటిని వదలటం లేదని, ప్రకాశం బ్యరేజిలో నీటిమట్టం ఐదు అడుగులకు తగ్గిపోతే కూడా తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదని, అలా ఎందుకు చేశారో చెప్పాలని దేవినేని కోరారు. కృష్ణా బోర్డుపై ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వడానికికేంద్రం సిద్దపడుతుంటే తెలంగాణ అనవసర రాద్దాంతం చేస్తుందని దేవినేని విమర్శించారు. కాల్వలు,ప్రోజేక్ట్లుల నీటి పంపిణిపై విభజన చట్టంలో స్ప్రష్టం చేసారని, వాటిని తెలంగాణ పాటించాలని సూచించారు. కృష్ణా బోర్డు పరిధిని కేంద్రం వెంటనే ప్రకటించాలని, అలా ప్రకటిస్తే రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని దేవినేని ఉమ తెలిపారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని దేవినేని పేర్కొన్నారు.

Leave a Reply