ఆంధ్రా – రాయలసీమ – తెలంగాణ మధ్య తేడా తెలుసా..?

తెలుగు మాట్లాడే ప్రజలంతా తాము ఉండే ప్రాంతాలను ప్రధానంగా మూడుగా విభజించుకున్నారు. అవి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా. ఇక్కాడ నివసించే వారు అందరు తెలుగు వారే అయినా వారి ఆచార వ్యవహారాలూ, సంస్కృతి వేరు వేరుగా ఉంటాయి. అలాగే ఆయా ప్రాంత ప్రజల ఆలోచనల్లో కుడా మనకు ఎంతో తేడా కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ఒక ఆంగ్ల పత్రిక తమ ఎడిటోరియల్లోఆసక్తికర కథనాన్ని వెలువరించింది. అదేమిటంటే బ్రిటిష్ వాడు భారత దేశాన్ని విడిచి వెళ్ళే టప్పుడు తెలంగాణలో ఒక వ్యక్తికి, రాయలసీమలో ఒక వ్యక్తికి, ఆంధ్రలో ఒక వ్యక్తికి తుపాకిలను ఇచ్చి వెళ్ళాడు. తుపాకి తీసుకున్న తెలంగాణ వ్యక్తి వేటకు వెళ్లి జంతువులను వేటాడి వాటితో కడుపు నింపుకునేవాడు. తుపాకి అందుకున్న రాయలసీమ వ్యక్తి దానితో ప్రత్యర్థులను చంపడం మొదలుపెట్టాడు. తుపాకి అందుకున్న ఆంధ్రా వ్యక్తి మాత్రం దానిని అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. చూశారా ఒక చిన్న పిట్టకథతో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రజల మనోభావాలను ఏ విధంగా వివరించారో.

Leave a Reply